News November 8, 2025
పాడేరు: ‘కార్తీక వనసమారాధనోత్సవాలు పండగ వాతావరణంలో జరగాలి’

కార్తీకవన సమారాధన వారోత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఫారెస్ట్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమంగా వారం రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీసీ నిర్వహించారు. ప్రకృతిని కాపాడటం, ప్రకృతి పాత్ర గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News January 14, 2026
ఫ్యూచర్ సిటీలో సీఎం ‘నిశ్శబ్ద విప్లవం’

సిటీ అంటే హారన్ల గోల. కానీ ఫ్యూచర్ సిటీలో పక్షుల కిలకిలారావాలు వినొచ్చు. ఇది CM స్వయంగా దావోస్‌లో ప్రపంచానికి పరిచయం చేయబోతున్న శబ్దంలేని అద్భుతం. ఫ్యూచర్ సిటీని ఇండియాలోనే మొదటి ‘సైలెన్స్ జోన్’ నగరంగా మార్చే బ్లూప్రింట్ రెడీ అయింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ జోన్లలో ‘నాయిస్ అబ్జార్బ్‌షన్ రోడ్లు’ వేయబోతున్నారు. అనవసరంగా హారన్ కొడితే AI డిటెక్టర్లతో నం. ప్లేట్ స్కాన్ అయ్యి చలాన్ జనరేట్ అవుతుంది.
News January 14, 2026
మేడారం గద్దెల వద్ద ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు..!

మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మ గద్దెలో ప్రాంగణంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. తల్లుల దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కరెంటు వైరు పలుచోట్ల తెగి కనిపించడంతో పాటు అతుకులుగా ఉన్నాయి. భక్తులు ఎవరైనా చూసుకోకుండా వాటిపై కాలు వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
News January 14, 2026
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నం.1

విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానం దక్కించుకున్నారు. ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్న అతడు ICC తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ను వెనక్కి నెట్టి నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ ప్లేస్‌కి చేరారు. రోహిత్ శర్మ మూడో ర్యాంకుకు పడిపోయారు. గిల్-5, శ్రేయస్-10 స్థానంలో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 28,068 రన్స్‌తో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా 34,357 పరుగులతో సచిన్ తొలి స్థానంలో ఉన్నారు.


