News February 7, 2025
పాడేరు: ‘గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులే కీలకం’

గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర పోషించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ స్పష్టం చేశారు. పంచాయతీలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల మండలాల్లో ఆకాంక్ష పంచాయతీల సర్పంచులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆకాంక్ష పంచాయతీల్లో విద్య, వైద్యం, పోషకాహారం, వ్యవసాయం, రహదారి సదుపాయాలు కల్పనకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు.
Similar News
News February 12, 2026
రౌడీ షీటర్ హత్య.. మదనపల్లిలో మూలాలు..!

పుంగనూరు రౌడీషీటర్ డీజే భాస్కర్ కర్ణాటక నంగిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఈ కేసులో మూలాలు మదనపల్లెలో ఉన్నట్లు బయటపడింది. మొండెం ఆంధ్ర సరిహద్దులోనూ.. తల కర్ణాటకలో దొరికింది. దీనిపై కేసు నమోదు చేసిన సంగిలి పోలీసులు విభిన్నకోణాల్లో దర్యాప్తు సాగించారు. అనంతరం మదనపల్లిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేసే యువతను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
News February 12, 2026
నేటి అసెంబ్లీ షెడ్యూల్

AP: ఇవాళ అసెంబ్లీ ఉ.9 గం.కు ప్రారంభం కానుంది. 10 గం. వరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. సభ నడిచే 17 రోజుల్లో రోజుకు 10 ప్రశ్నలు మాత్రమే అనుమతిస్తారు. అనంతరం ప్రభుత్వం 8 సవరణ ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, దానిపై చర్చలు జరగనున్నాయి. ఎల్లుండి (ఫిబ్రవరి 14) మంత్రి పయ్యావుల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
News February 12, 2026
MDK: అందరి చూపు అటువైపే..

మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి చూపు రేపటి ఓట్ల లెక్కింపుపైనే ఉంది. ఓట్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కావడంతో గెలుపోటములపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. బయటకు తామే గెలుస్తామని చెప్పుకుంటున్నా.. సర్వేల్లో విభిన్న ఫలితాలు రావడం, పోలింగ్ తర్వాత అభ్యర్థులు డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల ద్విముఖ, త్రిముఖ పోరు, బలమైన నాయకులు ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.


