News May 7, 2025
పాడేరు: ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు

పాడేరులో శుక్రవారం నిర్వహించిన ఏపీఆర్ఎస్ CAT, ఏపీఆర్‌జేసీ అండ్ ఏపీఆర్‌డీసీ CET 2025 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 5, 6, 7, 8 తరగతులకు సంబంధించి ఏపీఆర్ఎస్ CAT, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఏపీఆర్‌జేసీ అండ్ ఏపీఆర్‌డీసీ CET పరీక్షలు నిర్వహించామన్నారు. CAT పరీక్షకు 176 మంది, CET పరీక్షలకు 591 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.
Similar News
News February 13, 2026
సంగారెడ్డి: తొలి ఫలితం.. కాంగ్రెస్ విజయం

ఇంద్రేశం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం నమోదైంది. మున్సిపాలిటీలోని 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి లక్డారం సరిత భుజంగరెడ్డి తన సమీప ప్రత్యర్థి ఒగ్గు సుమతిపై 158 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. మిగిలిన వార్డుల ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
News February 13, 2026
కాగజ్‌నగర్‌లో తొలి విజయం BJPదే

SKZR మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో BJP ఖాతా తెరిచింది. 21వ వార్డులో అభ్యర్థి దూసరి కృష్ణవేణి ఘన విజయం సాధించారు. పార్టీ సిద్ధాంతాలను, తనను నమ్మి ఓటు వేసిన ఓటర్లకు ఆమె మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. వార్డు అభివృద్ధియే లక్ష్యంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు విజయోత్సవంలో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
News February 13, 2026
తల్లిపాల విషయంలో ఈ అపోహలు వద్దు

పిల్లలకు తల్లిపాలు అమృతతుల్యం. అయితే అపోహలతో కొందరు పిల్లలకు సరిగా పాలు పట్టట్లేదంటున్నారు నిపుణులు. సరిపడా పాలు రావట్లేదని కొందరు ఫార్ములా మిల్క్ ఇస్తుంటారు. కానీ పిల్లల తరచూ పాలు ఇస్తుంటేనే పాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు. అలాగే ఫార్ములా మిల్క్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. తల్లిపాలలో ఇమ్యునిటీ, ఐక్యూ బెటర్‌గా ఉంటుంది కాబట్టి పిల్లలకు తల్లిపాలే ఉత్తమం అని చెబుతున్నారు.


