News September 12, 2025
పాడేరు: ఫిర్యాదుల రిజిస్ట్రేషన్ పక్కాగా ఉండాలి

ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల రిజిస్ట్రేషన్‌ను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు ఐటీడీఏలో కార్యాలయంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్‌తో కలిసి ఫిర్యాదుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. అర్జీదారులకు జవాబుదారీగా ఉండాలని సూచించారు.ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం పక్కాగా ఉండాలన్నారు.
Similar News
News December 10, 2025
VJA: భవానీ భక్తులకు ప్రత్యేక క్యూలైన్‌ల ఏర్పాటు

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ సందర్భంగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వినాయకుడి గుడి నుంచి టోల్‌గేట్ మీదుగా కొండపై ఓం టర్నింగ్ వరకు 3 క్యూలైన్లు, ఓం టర్నింగ్ వద్ద అదనపు లైన్‌లతో కలిపి 5 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీక్షల విరమణ రోజుల్లో టికెట్ దర్శనాలకు అనుమతి లేదు. దర్శనానంతరం భక్తులు శివాలయం మెట్ల మార్గం ద్వారా దిగివెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
News December 10, 2025
కామారెడ్డి: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జడ్జి

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హ్యూమన్ రైట్స్ హెల్త్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డిలో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి నాగరాణి హజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తమ హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News December 10, 2025
మోప్మ వార్షిక సంచికను విడుదల చేసిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెప్మా 2024-2025 వార్షిక సంచికను కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం ఆవిష్కరించారు. పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, ముఖ్యంగా మహిళల ఆర్థిక సాధికారికకు కృషి చేస్తుందన్నారు. మహిళలు నిరుపేదలు ప్రభుత్వం అందించే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు.


