News March 13, 2025
పాడేరు: రేపు ‘మీకోసం’ కార్యక్రమం రద్దు

ఈనెల 14వ తేదీ శుక్రవారం జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘మీకోసం’ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం హోలీ పండుగ ప్రభుత్వ సెలవు దినం పురస్కరించుకుని ‘మీకోసం’ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ‘మీకోసం’ రద్దయిన సందర్భంగా స్థానిక, స్థానికేతర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ శుక్రవారం‘మీకోసం’ కార్యక్రమానికి రావద్దని కలెక్టర్ సూచించారు.
Similar News
News February 18, 2026
రాంబిల్లి: పేలిన అమ్మోనియా గ్యాస్ సిలిండర్.. ఉద్యోగి మృతి

రాంబిల్లి మండలంలో ఇన్నోవేర్ ల్యాబ్ పరిశ్రమలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో కెమిస్ట్ బొద్ద అజయ్ కుమార్ (21) మృతి చెందాడు. అమోనియా గ్యాస్ సిలిండర్ ఆకస్మికంగా పేలడంతో విషవాయువు వ్యాపించింది. విషవాయువును పీల్చిన అజయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కెమిస్ట్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.
News February 18, 2026
KMR: కూరగాయల ధరలపై లుక్కెద్దాం..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మార్కెట్లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి.. ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో చొప్పున టమాట రూ.15, గోరుచిక్కుడు 50, బెండకాయ 40, దోసకాయ 40, బీరకాయ 50, ఆలుగడ్డ 40, క్యారెట్ 40, బీట్ రూట్ 50, పచ్చిమిర్చి 50, పాలకూర 40, క్యాబేజీ 50, కాలీఫ్లవర్ 60, వంకాయ 50, దొండకాయ 50, చిక్కుడు కాయ 50, ఉల్లిగడ్డ 30, ఎల్లిగడ్డ 200, అల్లం 80, మూలగకాయ 60, మెంతి, కొత్తిమీర రూ.10 (ఒక కట్ట)
News February 18, 2026
జనగామ పురపాలకలో పునరావృతమైన 1982

జనగామ పురపాలక చరిత్రలో 44 ఏళ్ల క్రితం జరిగిన రాజకీయ వాతావరణం మరోసారి జరిగింది. 1982లో మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల్లో వీరారెడ్డి భాస్కర్ రెడ్డి, రొండ్ల లక్ష్మారెడ్డికి సమాన ఓట్లు రావడంతో లాటరీ విధానంలో డ్రా తీసి భాస్కర్ నిరెడ్డి ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. మళ్లీ నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతినే ఛైర్మన్ ఎన్నిక జరిగింది.


