News March 3, 2025
పాడేరు: ‘సెకండ్ ఇయర్ పరీక్షలకు 26 పరీక్షా కేంద్రాలు’

అల్లూరి జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఐఈవో అప్పలరాము తెలిపారు. పరీక్షలకు సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులు 5,335 మంది, ఒకేషనల్ 1,322 మంది విద్యార్థులు హాజరు అవుతారని అన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకోవాలన్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Similar News
News March 27, 2025
HYD: పెరుగుతున్న ట్యాంకర్ల పెండెన్సీ

HYDలో జలమండలి ట్యాంకర్ల పెండెన్సీ నానాటికి పెరిగుతోంది. జలమండలి పరిధిలో 75 ఫీలింగ్ స్టేషన్లు ఉండగా.. 20 స్టేషన్లు మినహా మిగతా వాటిలో 24 నుంచి 48 గంటలు దాటితే కానీ ట్యాంకర్లు డెలివరీ కానీ పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డిగూడ, షాపూర్‌నగర్, గచ్చిబౌలి-2, మణికొండ, ఫతేనగర్‌లతోపాటు మిగతా ఫిల్లింగ్ స్టేషన్లలో డెలివరీకి 2, 3 రోజులు పడుతుందని జలమండలి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
News March 27, 2025
పాలమూరు యూనివర్సిటీలో ఉగాది వేడుకలు ప్రారంభం

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో గురువారం ఉగాది వేడుకలను యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలో విశ్వావసు నామా సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని కాంశించారు. కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
News March 27, 2025
మహబూబ్‌నగర్‌లో ముమ్మరంగా రంజాన్ ఏర్పాట్లు

రంజాన్ పండుగను పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వాగు గుట్ట వద్ద మైనార్టీ సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఏర్పాట్లను మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైట్లు, కూలర్ల ఏర్పాటు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అన్నారు. కార్యక్రమంలో నాయకుడు సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.