News August 14, 2025
పాడేరు: ‘సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం’

గిరిజన ప్రాంతంలో సాగు చేస్తున్న సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. బుధవారం పాడేరు కాఫీ హౌస్లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేంద్రీయ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల ప్రదర్శనను ప్రారంభించారు. సేంద్రీయ ఉత్పత్తుల ప్రదర్శనలో 10 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. గిరిజన ఉత్పత్తులకు అరకు బ్రాండ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.
Similar News
News March 14, 2026
జాకారం సర్పంచ్ వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు

జాకారం సర్పంచ్ సమత ఆత్మహత్యాయత్నం చేసిన అంశంపై కలెక్టర్ దివాకర ఆరా తీశారు. పంచాయతీ అధికారుల ద్వారా సమాచారం సేకరించారు. ఈ క్రమంలో ములుగు ఎస్సై ఉపేందర్ రావు జిల్లా ఆస్పత్రికి వెళ్లి సర్పంచ్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. కాగా, మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చర్చనీయాంశంగా మారింది.
News March 14, 2026
రెండోసారి తల్లయిన నటి పూర్ణ

టాలీవుడ్ నటి పూర్ణ రెండోసారి తల్లయ్యారు. ఇవాళ ఉదయం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త ఆసిఫ్ ఆలీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఎలాంటి సమస్యలు లేకుండా సురక్షితంగా డెలివరీ అయినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ 2022లో వ్యాపారవేత్త ఆసిఫ్ ఆలీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2023లో బాబుకు జన్మనిచ్చారు. ఈమె తెలుగులో సీమ టపాకాయ్, అవును, సుందరి, అఖండ తదితర చిత్రాల్లో నటించారు.
News March 14, 2026
సిక్కోలు దొర..సేవలు మరువలేం

మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సిక్కోలు జిల్లాకు పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చిన హనుమంతు జగన్నాథ దొర మన ప్రాంత వాసి కావడం గర్వకారణం.1943లో కోటబొమ్మాళి(M) జర్జంగిలో జన్మించిన హెచ్. జె.దొర పోలీసు శాఖలో 40 ఏళ్లుగా పని చేశారు. స్వగ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణమండపం, శివాలయాన్ని నిర్మించారు. సొంత ఇంటిని వృత్తి విద్యా శిక్షణా కేంద్రంగా మార్చి నిరుద్యోగులకు బాసటగా నిలిచారు.


