News August 13, 2025

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం

image

MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ కోసం మొదట 1,100 ఆస్తులు సేకరించాల్సి ఉన్నట్లుగా మెట్రో రైలు సంస్థ తెలిపింది. ఇటీవల ఇంజినీరింగ్ నిపుణుల బృందం అలైన్‌మెంట్ సరిదిద్దడంతో ఆస్తుల సంఖ్య 900కు తగ్గినట్లుగా ఎండీ NVS రెడ్డి ప్రకటించారు. దీంతో ఆస్తుల కూల్చివేత, రోడ్డు విస్తరణ, పిల్లర్స్ మార్కింగ్ పనులు వేగంగా సాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Similar News

News March 15, 2026

22న రైతు భరోసా నిధులు

image

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 22వ తేదీ రైతు భరోసా మొదటి విడత నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. సిద్దిపేట(D) నర్మెట్టలో CM రేవంత్ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు 20రోజుల తర్వాత రెండో విడత, APR నెలాఖరులోగా మూడో విడత నిధులు అందజేయనున్నారు. 3 విడ‌త‌ల్లో క‌లిపి రైతుల ఖాతాల్లో సుమారు రూ.9 వేల కోట్లు జమ కానున్నాయి.

News March 15, 2026

LSGకి బిగ్ షాక్?

image

ఈ నెలాఖరున ప్రారంభమయ్యే IPLలో LSG జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంతో ఈ సీజన్ ఆడటం అనుమానమే అని అంటున్నాయి. తొడ కండరాల గాయం వల్ల T20WCలోనూ అతను ఆడలేదు. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈసారి వేలంలో ఇతడిని LSG రూ.2కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్లో హసరంగా RR తరఫున ఆడి 11 వికెట్లు తీశారు.

News March 15, 2026

ప్రకాశం: పాలేరు వాగులో మృతదేహం.. దర్యాప్తు ముమ్మరం

image

జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలోని పాలేరు వాగులో దొరికిన <<19383562>>మృతదేహంపై <<>>పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుడి ఆనవాళ్ల కోసం సోషల్ మీడియాలో ఫొటోలు ఉంచడంతో పాటు పక్క జిల్లాల పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపినట్లు ఎస్ఐ మహేంద్ర తెలిపారు. ఎవరైనా అదృశ్యమైన వ్యక్తుల వివరాలు ఉంటే తక్షణమే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.