News September 12, 2025
పాతబస్తీ మెట్రో.. రూ.433 కోట్ల పరిహారం విడుదల

పాతబస్తీ మెట్రో పనులపై MD NVS రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. భవన కూల్చివేత సాగుతుండగా రూ.433 కోట్ల పరిహారం విడుదల చేశారు. ప్రత్యేక నోటీసులో అధికారులు వివరాలు తెలిపారు. ఇప్పటివరకు పాతబస్తీ మెట్రో రూట్‌లో దాదాపు 550 భవనాల కూల్చివేత పూర్తయినట్లు వెల్లడించారు.
Similar News
News December 12, 2025
HYD: ఫ్యాషన్ మార్కెట్‌ను శాసిస్తోన్న Gen Z

ఇకపై ‘కొక్వెట్ బో’లు, మాస్ ట్రెండ్‌లకు చోటు లేదు. ఇప్పుడు ఫ్యాషన్ మార్కెట్‌ను ‘జిన్-జడ్’ (Gen Z) శాసిస్తోంది. వీరు Y2K క్లిప్‌లను ఎథ్నిక్ బ్లౌజ్‌లు, సంప్రదాయ చేనేత దుస్తులను జెండర్-న్యూట్రల్‌గా ధరిస్తున్నారు. AR try-ons టెక్నాలజీతో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తూ, సెకండ్ హ్యాండ్ దుకాణాలను జల్లెడ పడుతున్నారు. సొంతంగా ఎవరికీ తెలియని ‘అన్‌రిపీటబుల్’ స్టైల్ సృష్టించుకోవడమే నేటి ట్రెండ్.
News December 12, 2025
ఖైరతాబాద్: 19 నుంచి ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

మహానగరం మరో భారీ కార్యక్రమానికి వేదిక కానుంది. ఈ నెల 19 నుంచి సిటీలో HYD ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ వేడుకలు ఉంటాయి. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. యూరప్, అమెరికా తదితర సినిమాలు ఇందులో ప్రదర్శిస్తారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు.
News December 12, 2025
నగరంలో TTD క్యాలెండర్లు, డైరీల విక్రయం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రాలతో అందంగా రూపొందించిన క్యాలెండర్లు, డైరీలు ఇపుడు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయాల్లో వీటితో పాటు శ్రీవారి లడ్డూలు అందుబాటులో ఉన్నాయని TTD అధికారులు తెలిపారు. క్యాలెండర్లు రూ.130, రూ.75, డైరీలు రూ.150, రూ.120కు విక్రయిస్తున్నారు. భక్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు.


