News September 11, 2025
‘పాత పద్ధతిలోనే ఖాళీలను భర్తీ చేయాలి’

మణుగూరు ఏరియా ఉపరితల విభాగంలో ఖాళీగా ఉన్న జనరల్ అసిస్టెంట్ పోస్టులను కొండాపురం అండర్‌గ్రౌండ్ కార్మికులతోనే భర్తీ చేయాలని టీబీజీకేస్ వైస్ ప్రెసిడెంట్ నాగేల్లి వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసాచారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఏప్రిల్‌లో యాజమాన్యం కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల వల్ల అండర్‌గ్రౌండ్ కార్మికులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 11, 2025
నంద్యాల మీదుగా వెళ్లే రైలుకు బోగీల పెంపు

నంద్యాల మీదుగా ప్రయాణించే గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల్లో మార్పు చేశారు. గతంలో 19 బోగీలతో ఉన్న ఈ రైలు ఇక నుంచి 24 బోగీలతో ప్రయాణించనుంది. ఇందులో ఒక సెకండ్ ఏసీ, మూడు థర్డ్ ఏసీ, 14 స్లీపర్, నాలుగు జనరల్ బోగీలు ఉంటాయి. ఈ సౌకర్యం ఈ నెల 18 నుంచి తిరుపతి వైపు రైలుకు, 19 నుంచి గుంటూరు వైపు రైలుకు అందుబాటులోకి రానుంది.
News December 11, 2025
నిద్ర తక్కువైతే!

నిద్ర తక్కువైతే ఆరోగ్యం దెబ్బతిని గుండె జబ్బులు, బీపీ, మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కొన్ని రోజులు సరైన నిద్ర లేకుంటే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఏకాగ్రత లోపించడం, నిరాశ, కుంగుబాటు వంటివి పెరుగుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి ఆయుష్షునూ తగ్గిస్తుంది’ అని చెబుతున్నారు. మంచి నిద్ర కోసం ధ్యానం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, క్రమమైన నిద్ర సమయాలు పాటించాలని సూచిస్తున్నారు.
News December 11, 2025
ప్రకాశం: గ్యాస్ కనెక్షన్ లేకుంటే వెంటనే లబ్ధి చేకూర్చాలి.!

ప్రకాశం జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేద కుటుంబాలకు వెంటనే గ్యాస్ కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో జేసీ బుధవారం సమావేశమయ్యారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రవర్తనపై ఐవిఆర్ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుందన్నారు. డెలివరీ సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడవద్దన్నారు.


