News August 23, 2025
పాదయాత్రను విజయవంతం చేయాలి: మంత్రి

ఈనెల 25న వర్ధన్నపేట నియోజకవర్గంలో నిర్వహించబోయే జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో కాంగ్రెస్ నేతలతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సారయ్య, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, మక్కన్ సింగ్ ఠాకూర్, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
Similar News
News January 16, 2026
KNR: ఎన్నికల నగారా.. టికెట్ వేటలో ఆశావహులు

మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్‌లో రాజకీయ సందడి మొదలైంది. కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రి, స్థానిక ఎమ్మెల్యేల ప్రాతినిధ్యంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో టికెట్ ఆశావహుల తాకిడి పెరిగింది. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు తమ గళాన్ని వినిపిస్తూ, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
News January 16, 2026
విశాఖలో భూ లిటిగేషన్‌లతో తలపోటు (1/2)

విశాఖలో భూ లిటిగేషన్లు మరోసారి తలపోటుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములపై అక్రమార్కులు తిష్ట వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో వివాదాలు తెరపైకి రావడం యంత్రాంగానికి సవాల్‌గా మారింది. శివారు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరగడంతో యాజమాన్య హక్కులపై సవాళ్లు పెరుగుతున్నాయి.
News January 16, 2026
విశాఖలో భూ లిటిగేషన్‌లతో తలపోటు (2/2)

విశాఖలో భూ లిటిగేషన్లు ఎంతలా ఉన్నాయంటే.. ఇటీవల పెందుర్తి (M) చింతగట్లలో ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై రాళ్లదాడికి తెగబడ్డారు. అదేవిధంగా గండిగుండంలో భూ వివాదం చెలరేగింది. VMRDA చేపడుతున్న అడవివరం–సొంట్యం రహదారి విస్తరణతో ల్యాండ్ విలువ రూ.కోట్లు పలుకుతోంది. ఈ నేపథ్యంలో అక్రమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నా.. లిటిగేషన్ బ్యాచ్‌ల ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి.


