News October 2, 2024
పాన్‌గల్: క్షుద్ర పూజలు కలకలం.. గ్రామస్థుల్లో టెన్షన్..
పాన్‌గల్ మండలం కేతేపల్లి గ్రామంలోని గుండ్ల చెరువుకు వెళ్లే దారిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, తెల్లని పిండితో మనిషిని పోలిన బొమ్మను గీశారని గ్రామస్థులు తెలిపారు. దారి నుంచి పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. రాతియుగం నుంచి రాకెట్ యుగం వచ్చినా ఇలాంటి క్షుద్రపూజలు ఏంటని పలువురు అంటున్నారు.
Similar News
News October 9, 2024
NGKL: కొల్లాపూర్ ఆర్డీవో సస్పెండ్
విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని కొల్లాపూర్ RDO నాగరాజును సస్పెండ్ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. పద్ధతి మార్చుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరించినా మారకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కాగ ఆయన 2 నెలల్లో రిటైర్డ్ కానున్నారు. ధరణి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సమస్యలకు రైతులకు సరైనా సమాధానం ఇవ్వడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే అవినీతి అరోపణలు ఉన్నాయి.
News October 9, 2024
MBNR: డీఎస్సీకి 1,131 మంది ఎంపిక
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,131 మందితో DSC తుది జాబితాను విద్యాధికారులు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు నేడు LB స్టేడియంలో CM రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. MBNR-243, గద్వాల-172, NGKL- 285, వనపర్తి-152, NRPT-279 మంది ఎంపికయ్యారు. వారిని సీఎం సభకు తరలించేందుకు జిల్లాల వారీగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. దసరా సెలవుల్లోగా పాఠశాలలను కేటాయించనున్నట్లు సమాచారం.
News October 9, 2024
గురుకులాలు రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర: RSP
నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు BRS ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గురుకుల పాఠశాలలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని BRS నేత RS ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం సకల హంగులతో గురుకులాలను నిర్మించి అన్ని వర్గాల పిల్లలకు చదువుకొనే అవకాశం కల్పించిందని RSP గుర్తు చేశారు.