News May 7, 2025

పామిడి: బిడ్డకు ఐస్ తినిపిస్తున్న తల్లి కోతి.!

image

పామిడిలో శుక్రవారం ఓ ముచ్చటైన సన్నివేశం చూపరులను ఆకట్టుకుంది. తీవ్ర ఎండలకు మనుషులతో పాటు పశు, పక్షాదులు అల్లాడిపోతున్నాయి. దాహర్తిని తీర్చుకోవడానికి మనుషులకు పలు మార్గాలు ఉన్నాయి. మరి జంతువులు తీవ్ర అవస్థలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ తరుణంలో ఓ కోతి చేసిన పని అందరినీ ముగ్ధుల్ని చేసింది. రహదారిపై ఐస్ తింటూ వెళ్లేవారి వద్ద లాక్కుని తల్లి కోతి బిడ్డకు తినిపించిన సీన్ ఆకట్టుకుంది.

Similar News

News February 14, 2026

ఈ ఫలితాలు ప్రజల విశ్వాసాన్ని చాటాయి: ఖర్గే

image

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు పార్టీపై ప్రజల విశ్వాసాన్ని చాటాయని పేర్కొన్నారు. 3.8 కోట్ల ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారిత, నిరంతర పురోగతి అందిస్తూ ‘ప్రజా తెలంగాణ’కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ కాసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు.

News February 14, 2026

కామారెడ్డిలో కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’

image

కామారెడ్డి మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, DCC చీఫ్ మల్లికార్జున్ సమక్షంలో ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఈ చేరికలతో కాంగ్రెస్ బలం 21కి చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్‌కు ఇంకా 4 సభ్యుల మద్దతు అవసరం ఉంది. MP ఎక్స్‌ అఫీషియో ఓటును కలుపుకొన్నా, మరో ముగ్గురు కౌన్సిలర్ల మద్దతు ఉంటేనే కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.

News February 14, 2026

జగిత్యాల: పార్టీ నిరాకరించినా.. ప్రజలు మాత్రం ప్రజా సేవకులకే పట్టం

image

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డు బీజేపీ టికెట్ ఆశించిన ఆరవ లక్ష్మి (బిట్టు), 26వ వార్డు బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ పులి రమ (శ్రీధర్) టికెట్ దక్కక ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. బీజేపీ టికెట్‌ను వేరే వారికి కేటాయించడంతో వీరి కుమారులు కన్నీరు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పార్టీ నిరాకరించినా ప్రజలు మాత్రం ప్రజా సేవకులను ఆదరిస్తారు అనే దానికి ఇదే నిర్వచనం.