News October 8, 2025

పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి: నిర్మల్ కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికలలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ మీడియా మానిటరింగ్‌ సర్టిఫికేషన్‌ కమిటీ (ఎంసిఎంసి)ని జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని సమాచార శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను ప్రారంభించి అధికారులతో మాట్లాడారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి వార్తపై నిఘా ఉంచాలని సూచించారు.

Similar News

News January 15, 2026

‘జన నాయగన్’ విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ

image

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సూచించింది. గతంలో U/A సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అయితే, CBFC సర్టిఫికెట్ క్లియరెన్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతలు SCని ఆశ్రయించారు.

News January 15, 2026

బిక్కనూర్: ‘వ్యవసాయం ఉద్యోగం కాదు.. అది జీవన విధానం’

image

వ్యవసాయం ఉద్యోగం కాదు.. అది మన జీవన విధానం అని చాటిచెప్పింది కాచాపూర్ గ్రామానికి చెందిన చిన్నారి మహాన్వి. సంక్రాంతి పురస్కరించుకుని గురువారం ఆమె వేసిన ముగ్గు గ్రామస్తులను ఆలోచింపజేసింది. రైతు జీవన శైలిని ప్రతిబింబిస్తూ రంగురంగులతో తీర్చిదిద్దిన ఈ రంగవల్లిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే వ్యవసాయంపై మమకారాన్ని చాటిన మహాన్విని పలువురు అభినందించారు.

News January 15, 2026

మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే?

image

* మనీ ప్లాంట్ పెంచే నీళ్లలో కొద్దిగా శీతల పానీయాలు పోస్తే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది. * వంటింట్లో నాలుగు మూలలు బోరిక్ యాసిడ్ పౌడర్‌ చల్లితే దోమల బెడద తగ్గుతుంది. * కళ్లజోడు అద్దాలకు టూత్ పేస్ట్ రాసి టిష్యూ పేపర్‌తో శుభ్రం చేస్తే జిడ్డు పోతుంది. * అన్నం విడివిడిగా రావాలంటే ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ కనోలా ఆయిల్ వేయాలి. * చపాతీలను బియ్యప్పిండితో వత్తితే మృదువుగా వస్తాయి.