News March 12, 2025

పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీలు పోటీపడాలి: కలెక్టర్

image

పార్వతీపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఈఓపిఆర్డీలకు స్వచ్ఛ సుందర పార్వతీపురం పై శిక్షణా కార్యక్రమం జరిగింది. బుధవారం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీలు పోటీపడి తమ పంచాయతీలను నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

Similar News

News February 18, 2026

ప్రభుత్వ ఆఫీసులలో AC ఉష్ణోగ్రతపై పరిమితి

image

TG: ప్రభుత్వ ఆఫీసులలో ACలను కనిష్ఠంగా 25డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం పరిమితి విధించింది. ఇంధన పొదుపుతో పాటు బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఈ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొంది. ఇప్పటికే ఆఫీసులు, స్కీముల విద్యుత్ బిల్లులు కొండల్లా పేరుకుపోయాయి. కొన్నేళ్లుగా డిస్కమ్‌లకు వీటి నుంచి రావాల్సిన బకాయి ₹48వేల CR వరకు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

News February 18, 2026

రాజమండ్రి కోర్టుకి బాంబు బెదిరింపు

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. రాజమండ్రి, కరీంనగర్, అనంతపురం కోర్టులకు ఈ కాల్స్ రావడంతో పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి కోర్టులో న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించి ముమ్మరంగా గాలించారు. ఎక్కడా బాంబు ఆచూకీ లభించకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నారు.

News February 18, 2026

అమరావతికి జీవధార.. 190 ఎంఎల్‌డి ప్లాంట్

image

అమరావతి రాజధానికి మంచినీటిని అందించేందుకు 190 ఎంఎల్‌డి సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాజధాని ప్రాంతానికి ఇదే ప్రధాన నీటి వనరుగా ఉండనుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇదే ప్లాంట్‌కు అదనంగా మరో 190 ఎంఎల్‌డి సామర్థ్యాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించారు. దీంతో నీటి కొరత లేకుండా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం.