News July 7, 2024
పార్టీ బలోపేతం కోసమే చేరికలకు ప్రాధాన్యం: చిన్నారెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి మండలం దత్తాయపల్లి మాజీ సర్పంచ్ దేవేందర్, పెద్ద తండా మాజీ సర్పంచ్ కుమారుడు రాజు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్లో చేరామని దేవేందర్, రాజు నాయక్ అన్నారు.
Similar News
News December 12, 2025
మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు

MBNR: గెలుపొందిన అభ్యర్థులకు డీజు సౌండ్‌తో ర్యాలీకి అనుమతి లేదు: ఎస్పీ డి.జానకి
@ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు.
@రాజపూర్ మండలం రంగారెడ్డిగూడ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతి 31 ఓట్లతో గెలుపు.
@నవాబుపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపు.
@రాజాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కావలి రామకృష్ణ 1104 భారీ మెజార్టీతో గెలుపు.
News December 11, 2025
రాజాపూర్: మెజార్టీ పెంచిన రీ కౌంటింగ్

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెంలో బీజేపీ గెలుపొందింది. మొదట కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అంజలిపై 6ఓట్లతో బీజేపీ బలపర్చిన అభ్యర్థి కాటేపాగ రేవతి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు రీ కౌంటింగ్ కోరడంతో నిర్వహించిన రీకౌంటింగ్‌లో రేవతికి 36ఓట్ల మెజార్టీ లభించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో విషయం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది.
News December 11, 2025
MBNR: ఫలితాల అనంతరం ర్యాలీలపై నిషేధం: ఎస్పీ డి జానకి

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల అనంతరం ఎలాంటి ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు, బాణసంచాలు, గుంపులుగా గుమిగూడడం పూర్తిగా నిషేధించబడిందని జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు. ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడడానికే ఈ చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


