News September 27, 2024
పార్లమెంట్ కమిటీ ఆన్ ఫైనాన్స్ సభ్యుడిగా వేమిరెడ్డి
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కీలక పదవిని దక్కించుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన పార్లమెంట్ కమిటీ ఆన్ ఫైనాన్స్ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు ఛైర్మన్లు, సభ్యులను నియమిస్తూ ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల అయింది. పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల జాబితాలో వేమిరెడ్డి పేరు ఉండటంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 11, 2024
సూళ్లూరుపేట: ఆ 4 షాపులకు ఒక్కో అప్లికేషన్
నూతన పాలసీ ప్రకారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో 14 వైన్ షాపులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటి వరకు కేవలం 27అప్లికేషన్లే వచ్చాయి. షాపు నంబర్ 175, 182, 183, 187కు కేవలం ఒక్కో దరఖాస్తు మాత్రమే దాఖలైంది. సాయంత్రంలోగా వీటికి మరెవరూ అప్లికేషన్ పెట్టుకోకపోతే లాటరీ అవసరం లేకుండా వీరికే షాపులు దక్కే అవకాశం ఉంది. అదృష్టాన్ని చెక్ చేసుకోవడానికి ఎవరైనా చివరి నిమిషంలో దరఖాస్తు పెడితే ఇక్కడ లాటరీ తప్పనిసరి.
News October 10, 2024
టాటా మృతి దేశానికి తీరని లోటు: మంత్రి నారాయణ
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై మంత్రి నారాయణ దిగ్ర్భాంతి చెందారు. ఆయన మాట్లాడుతూ.. కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి టాటా అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి భగవంతుని వేడుకున్నారు.
News October 9, 2024
సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండండి: నెల్లూరు SP
కస్టమ్స్, CBI, ED, ఏసీబీ అధికారులమని చెప్పి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు ఎస్పీ జి.కృష్ణ కాంత్ సూచించారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట వచ్చే కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.