News November 19, 2025

పార్వతీపురంలో ఈనెల 28న ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల గ్రీవెన్స్‌

image

ఈనెల 28వ తేదీ శుక్ర‌వారం ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక గ్రీవెన్స్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈనెల 28న క‌లెక్ట‌ర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11.00 గంటలకు గ్రీవెన్స్ ప్రారంభమవుతుందన్నారు. స‌మ‌స్య‌ల‌ను ఈ గ్రీవెన్స్‌లో దరఖాస్తుల రూపంలో అందజేయవచ్చని పేర్కొన్నారు.

Similar News

News January 23, 2026

కడప జిల్లాలో VRO సస్పెండ్.!

image

చెన్నూరు మండలం రామనపల్లి<<18926711>> VRO<<>> వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్‌పై అందిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా VROను సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.

News January 23, 2026

KNR: స్థానిక సంస్థల నుంచే ఉన్నత శిఖరాలకు..

image

ఉమ్మడి KNR జిల్లా నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్లుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పలువురు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బండి సంజయ్, గంగుల కమలాకర్, రామగుండం మాజీ MLAలు సోమారపు సత్యనారయణ, కోరుకంటి చందర్, KNR మాజీ MLAలు చల్మెడ ఆనందరావు, జువ్వాడి చంద్రశేఖర్‌రావు, ఇందుర్తి మాజీ MLA బొమ్మ వెంకటేశ్వర్లు, మాజీ MLCలు సంతోష్ కుమార్, గోపాల్ రావు తదితరులు కార్పొరేటర్ల నుంచే తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

News January 23, 2026

నేటి నుంచి తిరుపతిలో టోకెన్ల్ బంద్

image

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలు చేయనున్నారు. ఈక్రమంలో మూడురోజులు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఈనెల 23, 24, 25వ తేదీల్లో ఈ టికెట్లు జారీ చేయరు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను ఇస్తారు. ఈ మేరకు ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.