News March 4, 2025
పార్వతీపురం: అందుబాటులో పదో తరగతి హాల్ టికెట్లు

పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. తిరుపతి నాయుడు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, మీడియం, విద్యార్థి ఫోటో, సంతకం, సబ్జెక్టు వివరాలను నిశితంగా పరిశీలించల్లన్నారు. హాల్ టికెట్‌ల్లో ఏవైనా తప్పులు ఉంటే గుర్తించి తక్షణమే పరీక్షల విభాగాన్ని సంచాలకులకు సమాచారం అందించాలన్నారు. www.bse.ap.in వెబ్సైట్‌ను పరిశీలించాలని సూచించారు.
Similar News
News December 6, 2025
రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుంది: నిర్మల

రూపాయి పతనంపై కేంద్ర మంత్రి నిర్మల స్పందించారు. రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుందని అన్నారు. ఈ పతనం ప్రతికూలం కాదని, ఎగుమతిదారులకు ప్రయోజనకరమని చెప్పారు. ‘రూపాయి, కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్ల వంటివి చాలా సెన్సిటివ్ అంశాలు. మేం ప్రతిపక్షంలో ఉండగా నిరసనలు చేశాం. కానీ అప్పట్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఎకానమీ ఏ పొజిషన్‌లో ఉందో చూడండి’ అని HT సమ్మిట్‌లో అన్నారు.
News December 6, 2025
కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు(1/2)

వైరస్ ఆశించిన కూరగాయల మొక్కల్లో లేత ఆకులు చిన్నగా, పసుపు రంగుకు మారి పాలిపోయినట్లు కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై అక్కడక్కడ పసుపురంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులపై పసుపు చారలు ఏర్పడి, గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనెల మధ్యభాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకుల ఈనెలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారతాయి. మొక్క చివరి ఆకులు ఎండి, చనిపోయినట్లుగా ఉంటాయి.
News December 6, 2025
చెన్నూర్: గెలిపిస్తే.. ఉచిత అంబులెన్స్, పెళ్లికి రూ.5000

చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సర్పంచ్ అభ్యర్థి దుర్గం అర్చన సంతోశ్ వినూత్న మేనిఫెస్టోతో ప్రచారం చేస్తున్నారు. ఉచిత అంబులెన్స్, ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రూ.5,000 ఆర్థిక సాయం, సెంట్రల్ లైటింగ్ సిస్టంతో సహా 15 రకాల హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. హామీలను నమ్ముతూ ప్రజలకు బాండ్లు రాసి ఇస్తున్నారు.


