News December 2, 2025

పార్వతీపురం: ‘అవగాహనతోనే ఎయిడ్స్ అంతం’

image

ప్రజల్లో అవగాహనతోనే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయగలమని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురంలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ ఆయన ప్రారంభించారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత జీవన విధానాలను పాటించాలని సూచించారు. HIV అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, సామాజిక సమస్య కూడా అని, దానిని అందరం కలిసి ఎదుర్కోవాలని అన్నారు.

Similar News

News February 13, 2026

ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ముంబై<<>> పోర్ట్ అథారిటీ 10 జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీకామ్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in

News February 13, 2026

పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలి: సీఎస్

image

రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ విజయానంద్ శుక్రవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల సన్నద్ధతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏజెంట్ స్పేస్ డాక్యుమెంట్ అప్‌లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ కృతికా శుక్ల పాల్గొన్నారు.

News February 13, 2026

‘వారణాసి’ జానర్‌పై క్లారిటీ

image

వారణాసి సినిమా జానర్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ కాదని.. మైథలాజికల్ ఫాంటసీ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా రన్‌టైమ్ 3 గంటలకు కాస్త తక్కువ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందని.. మిగిలిన దాన్ని జూన్ 2026 కల్లా కంప్లీట్ చేస్తామన్నారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, VFX వర్క్‌పై ఫోకస్ పెడతామని పేర్కొన్నారు.