News December 2, 2025
పార్వతీపురం: ‘అవగాహనతోనే ఎయిడ్స్ అంతం’

ప్రజల్లో అవగాహనతోనే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయగలమని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురంలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ ఆయన ప్రారంభించారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత జీవన విధానాలను పాటించాలని సూచించారు. HIV అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, సామాజిక సమస్య కూడా అని, దానిని అందరం కలిసి ఎదుర్కోవాలని అన్నారు.
Similar News
News February 7, 2026
KNR: ఎన్నికల వేళ.. ప్లకార్డుల తయారీతో ఆర్టిస్టులకు ఉపాధి

మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలోని ఆర్టిస్టులకు ఉపాధి లభిస్తోంది. వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల పేరిట ఆర్టిస్టులు ప్లకార్డులు రూపొందిస్తున్నారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా కార్యకర్తలు చేతిలో పట్టుకునే విధంగా థర్మాకోల్ బోర్డుపై అభ్యర్థుల పేర్లను, గుర్తులను అందంగా రాస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఆకర్షనీయంగా కనిపిస్తున్న ప్లకార్డుల తయారీతో ఆర్టిస్టులకు ఉపాధి పెరిగిందని చెప్పవచ్చు.
News February 7, 2026
టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (<
News February 7, 2026
రేపు పఠించాల్సిన సూర్య మంత్రాలు

సూర్యారాధనలో మంత్ర పఠనం అత్యంత శక్తిమంతంగా పని చేస్తుందని నమ్మకం. ‘ఓం సూర్యాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నో సూర్య ప్రచోదయాత్’ అనే సూర్య మంత్రం బుద్ధిని ప్రకాశింపజేసి, ఆధ్యాత్మిక మేల్కొలుపును కలిగిస్తుంది. ‘ఓం సూర్యాయ నమః’ అనే సూర్య అష్టాక్షరి మంత్రం కూడా చాలా ప్రభావవంతమైనది. సూర్యోదయం సమయంలో ఈ మంత్రాలను పఠిస్తూ అర్ఘ్యం వదిలితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శరీరంలో కొత్త శక్తి ఉత్తేజితమవుతుంది.


