News December 2, 2025

పార్వతీపురం: ‘అవగాహనతోనే ఎయిడ్స్ అంతం’

image

ప్రజల్లో అవగాహనతోనే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయగలమని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురంలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ ఆయన ప్రారంభించారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత జీవన విధానాలను పాటించాలని సూచించారు. HIV అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, సామాజిక సమస్య కూడా అని, దానిని అందరం కలిసి ఎదుర్కోవాలని అన్నారు.

Similar News

News February 18, 2026

నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. అభి ఫామ్‌లోకి వచ్చేనా?

image

T20 WCలో భారత్‌ ఇవాళ తన చివరి లీగ్ మ్యాచ్‌‌ నెదర్లాండ్స్‌తో ఆడనుంది. సూపర్‌-8కు ముందు ప్లేయర్ల ప్రాక్టీస్‌కు ఇది మంచి అవకాశం. ముఖ్యంగా గంపెడు ఆశలు పెట్టుకున్న ఓపెనర్ అభిషేక్ శర్మ ఇవాళైనా ఫామ్‌లోకి రావాలి. గత 2 మ్యాచుల్లో అతడు డకౌట్ అయ్యారు. ఇక తిలక్ వర్మ తన ఆటలో దూకుడు పెంచాల్సి ఉంది. టాపార్డర్ విఫలమైతే సూర్య, హార్దిక్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలి. బౌలర్లంతా బాగానే రాణిస్తున్నారు.

News February 18, 2026

నల్గొండ: ఇంటర్ పరీక్షలకు సిద్ధం

image

నల్గొండ జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయగా, మొత్తం 27,018 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

News February 18, 2026

నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు బదిలీ..!

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసఫ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి వరకు ఇక్కడ ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో రవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.