News August 13, 2025
పార్వతీపురం: ఆ తేదీల్లో భారీ వర్ష సూచన

ఆగస్టు 17,18 తేదీల్లో పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు కొన్ని ప్రాంతాల్లో ఆ తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. భారీ వర్షాలు కురిస్తే తదనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Similar News
News March 14, 2026
దారుణం.. యువతికి HIV రక్తం ఎక్కించాడు!

TG: HIV సోకిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ (D) అన్నోజిగూడలో ఇటీవల మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. అతడికి HIV పాజిటివ్ అని తెలియడంతో అమ్మాయి పేరెంట్స్ పెళ్లికి నిరాకరించారు. కక్ష పెంచుకున్న మనోహర్ ఈనెల 11న యువతి ఇంటికి వెళ్లి సిరంజితో ఆమెకు HIV ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. ఇటీవల యువతికి జ్వరం రావడంతో విషయం బయటపడింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
News March 14, 2026
అల్లూరి: ఓపెన్ టెన్త్‌కు 15 సెంటర్స్

ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పరీక్షల కమిషనర్ శశికుమార్ శనివారం తెలిపారు. అల్లూరి జిల్లాలో 15 కేంద్రాల్లో 1,417మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. అల్లూరి జిల్లా నుంచి 1,003, పోలవరం జిల్లా నుంచి 414 మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. ఆరు సబ్జెక్ట్‌లో పరీక్షలు ఈ నెల 27వరకు జరుగుతాయి. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
News March 14, 2026
RJY: డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా

ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగ మద్యం, గంజాయి సేవనం, జూదం, చైన్ స్నాచింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయడమే లక్ష్యంగా రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాడుబడ్డ ఇళ్లు, అపార్ట్మెంట్లను డ్రోన్ల ద్వారా చిత్రీకరిస్తున్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


