News February 8, 2025
పార్వతీపురం: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు హాల్ టిక్కెట్లు సిద్ధం

పార్వతీపురం జిల్లాలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరగనున్న విషయం తెలిసింది. వీరి హాల్ టికెట్లను కళాశాల లాగిన్ లోను, ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్లో పొందుపరిచామని పార్వతీపురం మన్యం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి. మంజులవీణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 10, 2026
కామారెడ్డి: బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలి రాజీనామా

కామారెడ్డి జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అనిత మహేష్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 16వ వార్డు కౌన్సిలర్ టికెట్ల కేటాయింపులో తమకు సమాచారం లేకుండా ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. పార్టీలో గుర్తింపు లేనప్పుడు పదవిలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా లేఖను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. ఈ రాజీనామా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
News February 10, 2026
ఇండియా-పాక్ మ్యాచ్.. విమాన టికెట్లకు రెక్కలు

T20 ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ విషయంలో <<19097488>>పాక్ యూటర్న్<<>> తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగనున్న కొలంబోకు విమాన టికెట్ల ధరలు భారీగా ఎగిశాయి. ఇండియాతో ఆడతామని పాక్ ప్రకటించిన నిమిషాల్లోనే ఏకంగా రూ.10 వేలు పెరిగాయని సమాచారం. ప్రస్తుతం పోను రాను టికెట్ ధర రూ.60 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌కు ఇంకా 5 రోజులుండటంతో ఈ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
News February 10, 2026
KNR: తుది దశకు చేరిన మున్సిపల్ ‘పోరు’

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సెగ క్లైమాక్స్‌కి చేరింది. ప్రధాన పార్టీలైనా BRS, BJP, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని, బీజేపీ గెలిస్తేనే కేంద్రం నుంచి అధికంగా నిధులు వస్తాయని, పదేళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని బీఆర్ఎస్‌ను గెలిపించాలని ఆపార్టీల నేతలు చెబుతున్నారు. చివరికి ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడలి.


