News September 12, 2025
పార్వతీపురం: క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు అన్నారు. ఎన్సీడీ 4.0లో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్‌పై సిహెచ్ఓ, ఏఎన్ఎంలకు గురువారం పార్వతీపురం హోంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గైనకాలజిస్ట్ డా.శోభారాణి, డెంటల్ వైద్యులు డా.సుకృత పవర్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ అందించారు. క్యాన్సర్ లక్షణాలను ముందుగానే వైద్య సిబ్బంది గుర్తించాలన్నారు.
Similar News
News December 9, 2025
సంగారెడ్డి: నేడు మొదటి విడత ప్రచారానికి ముగింపు

జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు 9న సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు ఊరేగింపులు ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదన్నారు.
News December 9, 2025
KMR: శీతల గాలులు వీస్తున్నాయి.. జాగ్రత్త

కామారెడ్డి జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం నుంచి మరింత తక్కువ ఉష్ణోగ్రతలకు చేరుకుంటున్నాయి. రాత్రి 7 దాటిందంటే శీతల గాలులు వీస్తూ శరీర భాగాలు మంచులా తయారవుతున్నాయి. 75% మంది ప్రజలు పట్టణంలో రాత్రి 9 నుంచి రోడ్లపై కనబడట్లేదు. గ్రామాల్లోనైతే 7గం.ల నుంచే ఇళ్లకు పరిమితమవుతున్నారు. ప్రజలు ఉదయం, రాత్రి బయటకు రాకపోవడమే శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.
News December 9, 2025
హీరో రాజశేఖర్‌కు గాయాలు

హీరో రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయన కుడి కాలి మడమ వద్ద గాయమైంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా 3గంటల పాటు మేజర్ సర్జరీ చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స సక్సెస్ అయిందని, 4 వారాలు విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పాయి.


