News August 11, 2025

పార్వతీపురం గిరిమిత్రహాలులో శిక్షణ ప్రారంభం

image

గిరిజనుల అభివృద్ధికి గ్రామ స్థాయిలో మార్పును తీసుకురావాలన్న లక్ష్యంతో ‘ఆది కర్మయోగి’ మిషన్ కొనసాగుతోందని ఐటీడీఏ పీవో ఆశుతోష్ వాస్తవ, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక గిరిమిత్ర హాలులో జరిగిన ఆది కర్మయోగి జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమం అమలు చేసిందన్నారు.

Similar News

News March 12, 2026

కర్నూలులో 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు!

image

కర్నూలులోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్‌లో ఉన్న నందనం డిగ్రీ కాలేజీలో ఈనెల 14న ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీల్లో సుమారు 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ చదివినవారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కళాశాల కరెస్పాండెంట్ జనార్ధన్ తెలిపారు.

News March 12, 2026

సిద్దిపేట: టెన్త్ పరీక్షలు.. డీఈఓ కీలక సూచనలు

image

ఈనెల 14వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు సిద్దిపేట DEO శ్రీనివాస్ రెడ్డి కీలక సూచనలు చేశారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, వాచీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల వస్తువుల భద్రత కోసం క్లాక్ రూమ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.

News March 12, 2026

బాబాయ్, అబ్బాయ్ అనుబంధం జగన్‌కు బాగా తెలుసు: కదిరి ఎమ్మెల్యే

image

బాబాయ్, అబ్బాయ్ అనుబంధం జగన్‌కు బాగా తెలుసని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఒక బాబాయ్ హత్య గురించి తప్పు దోవ పట్టించారని, తిరుమలలో నెయ్యి కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని అన్నారు. పులివెందుల పక్కనే ఉన్నా జగన్ కదిరి ఆలయానికి ఎప్పుడైనా వచ్చారా అని ప్రశ్నించారు. ఏదో చిన్న ఘటన జరిగితే.. దానిని రాజకీయం చేస్తున్నారన్నారు.