News September 13, 2025
పార్వతీపురం: గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం

గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తామని జిల్లా ప్రజా రవాణాధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ప్రజా రవాణాధికారి కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ ప్రజా రవాణాధికారి కార్యక్రమానికి 26 వినతులు వచ్చాయి. ఉన్నతాధికారులను సంప్రదించి సాధ్యమైనంత వరకూ పల్లెలకు, చివరి గ్రామాలకు బస్సు సౌకర్యం, స్టాపుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News December 12, 2025
NLG: స్టేజ్- 2 ఆర్ఓ సస్పెండ్: కలెక్టర్

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో పోలైన బ్యాలెట్ పత్రాలు బయటికి వచ్చిన ఘటనలో స్టేజ్- 2 ఆర్‌వోను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పోలైన బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకువచ్చిన పేరు తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
News December 12, 2025
ఎప్‌స్టీన్ ఫైల్స్.. ట్రంప్, క్లింటన్, బిల్ గేట్స్ ఫొటోలు

అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ <<18464497>>ఎప్‌స్టీన్ ఎస్టేట్<<>> నుంచి సేకరించిన సంచలన ఫొటోలను హౌస్ ఓవర్‌సైట్ కమిటీ విడుదల చేసింది. ఇందులో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే ఈ ఫొటోలలో ఎవరూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనే విధంగా లేరని కమిటీ స్పష్టం చేసింది. కాగా <<18336928>>ఎప్‌స్టీన్ ఫైళ్ల<<>> విడుదలకు ఇటీవల ట్రంప్ ఓకే చెప్పగా ఇప్పుడు ఆయన ఫొటోలే బయటకు రావడం గమనార్హం.
News December 12, 2025
జనగామ: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి!

2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించే జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 641 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నారు. దీంతో పరీక్షను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.


