News March 14, 2025
పార్వతీపురం జిల్లాలో మూడు టీంలు: ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లాలో నేటి నుంచి శక్తి టీంలు రంగంలోకి దిగనున్నాయని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మొత్తం మూడు టీంలను ఏర్పాట చేసి నాలుగు వాహనాలు కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పార్వతీపురంలో ఒకటి, పాలకొండలో ఇంకొటి, సాలూరులో మరొక టీం ఉంటుందని పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం ఈ టీంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News February 16, 2026
ఆమదాలవలస: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి

ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కుద్దిరాం రైల్వే గేట్ సమీపంలో ఇవాళ జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంంతో జీఆర్‌పీ ఎస్ఐ మధుసూదనరావు ఘటనా స్థలాని చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతునికి 45 ఏళ్లు ఉంటాయని, గళ్ల చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్‌ను ధరించినట్లు చెప్పారు. వివరాలు తెలిసిన వారు స్థానిక జీఆర్పీ స్టేషన్ సంప్రదించాలన్నారు. దీనిపై కేసు నమోదైంది.
News February 16, 2026
రాజమండ్రి: పోలీస్ పీజీఆర్ఎస్‌కు 24 ఫిర్యాదులు

రాజమండ్రిలోని తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 24 మంది తమ అర్జీలను దాఖలు చేశారు. ఎస్పీ నరసింహ కిషోర్ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారంపై సంబంధిత స్టేషన్లకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. చట్టపరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
News February 16, 2026
బడ్జెట్ సెషన్ రెండో దశలో అమరావతి బిల్లు?

AP శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించేలా విభజన చట్ట సవరణ బిల్లుపై కసరత్తు చురుగ్గా సాగుతోంది. పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల రెండో దశలో దీన్ని ప్రవేశపెడతారని TDP వర్గాలు పేర్కొంటున్నాయి. టెక్నికల్, లీగల్ అంశాలపై న్యాయ, పట్టణ గృహనిర్మాణ, నీతి ఆయోగ్‌లకు హోమ్ శాఖ నోట్‌ను పంపింది. అనంతరం క్యాబినెట్ ఆమోదంతో బిల్లును పార్లమెంటులో పెడతారు. కాగా CM CBN ఈ బిల్లుపై కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు.


