News March 14, 2025

పార్వతీపురం జిల్లాలో వారి కోసం ‘ఊయల’

image

పార్వతీపురం మన్యం జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రుల ఆలనకు నోచుకోని పిల్లల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పీడీ కనకదుర్గ తెలిపారు. ఊయల పేరుతో ఏర్పాటు చేసిన కేంద్రాలను గురువారం ప్రారంభించారు. పిల్లలను పెంచలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు వారిని ఊయల కేంద్రంలో అప్పగించాలని సూచించారు.

Similar News

News February 12, 2026

ఎన్టీఆర్: పీజీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో MBA చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ రెగ్యులర్ & సప్లిమెంటరీ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. FEB 18 నుంచి మార్చి 2 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు 70 మార్కులకు వర్సిటీ పరిధిలోని కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://nagarjunauniversity.ac.in/ చూడాలని కోరారు.

News February 12, 2026

వనపర్తి: రేపే అసలు సిసలైన ‘కౌంటింగ్’.. అభ్యర్థుల్లో టెన్షన్..!

image

వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

News February 12, 2026

బడిపిల్లల కథలకు ఆహ్వానం: డీఈఓ యాదయ్య

image

విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు వారు రాసిన కథలను ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు నైతిక, మానవ విలువలు, నీతి, నిజాయితీ వంటి అంశాలతో కూడిన తమకు నచ్చిన అంశంపై ఒక పేజీకి మించకుండా తెలుగు లేదా ఇంగ్లిష్‌లో కథలు రాసి పంపాలని సూచించారు. మంచి కథలను ఎంపిక చేసి మార్చి మొదటివారంలో పుస్తకంగా వెలువరిస్తామన్నారు.