News April 13, 2025

పార్వతీపురం: జిల్లాలో 266 యూనిట్ల స్థాపనకు రూ.11.03 కోట్లు

image

పార్వతీపురం జిల్లాలో షెడ్యూల్ కులాల యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 266 యూనిట్ల స్థాపనకు రూ.11.03 కోట్లు కేటాయించినట్టు కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ శనివారం తెలిపారు. స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈనెల 14 నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దరఖాస్తులు https://apobmms.apcfss.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో సమర్పించాలని సూచించారు.

Similar News

News April 13, 2026

భద్రాద్రి కలెక్టర్‌తో ఎంపీ రేణుక భేటీ

image

ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా భద్రాచలం వచ్చిన ఆమెను కలెక్టర్ అంకిత్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వీరబాబు, కొత్తగూడెం మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, కమిషనర్ సుజాత కార్పొరేటర్లు స్వాగతం పలికారు. అనంతరం భద్రాద్రి జిల్లా సమస్యలు, సమగ్ర అభివృద్ధి పై చర్చించారు.

News April 13, 2026

పబ్లిక్ గార్డెన్‌లో రేపు అంబేడ్కర్ సినిమా ప్రదర్శన

image

నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో రేపు (మంగళవారం) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బయోపిక్ ప్రదర్శించనున్నారు. తెలుగు లలితకళా తోరణంలో ఈ ప్రదర్శన ఉంటుంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రదర్శన ఉంటుందని సాంస్కతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News April 13, 2026

భారత్‌ చేరుకున్న ఇరాన్ నౌకలు

image

పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ చమురు నౌకలు రెండు భారత్‌ చేరుకున్నాయి. గుజరాత్‌లోని సిక్కా పోర్టులో ఇవి లంగరేసినట్లు షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. దీంతో ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు వచ్చినట్లయింది. సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో మార్చి రెండో వారంలో ఈ రెండు నౌకలు ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరాయి.