News March 15, 2025

పార్వతీపురం జిల్లాలో BCలకు సబ్సిడీ లోన్లు

image

బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.23.24 కోట్లతో బీసీల స్వయం ఉపాధి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 22 లోగా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గరిష్ఠంగా 50 శాతం సబ్సిడీతో లోన్లు ఇస్తామన్నారు. జిల్లాలో ‘స్లాబ్ వన్’ క్రింద 868 యూనిట్లకు రూ.13.02 కోట్లు, ‘స్లాబ్ టూ’ క్రింద 260 యూనిట్లకు రూ.6.50 కోట్లు, ‘స్లాబ్ త్రీ’ క్రింద 93 యూనిట్లకు రూ.3.72 కోట్లు మంజూరు చేశామన్నారు.

Similar News

News February 11, 2026

జనగామ: 18 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేయొచ్చు!

image

పోలింగ్ కేంద్రాల్లోకి ఓటు వేసేందుకు వెళ్లే అభ్యర్థులు, ఓటర్లు 18 రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్లి ఓటు వేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఆధార్, పాన్ కార్డు, పాస్ పోర్ట్, బ్యాంకు పాస్ పుస్తకం, ఓటరు ఐడీ, జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, లేబర్ కార్డు, రేషన్ కార్డు, రైతు గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని చెప్పారు.

News February 11, 2026

ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్

image

ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ హరిత కోరారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, 100 శాతం పోలింగ్ నమోదుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సెలవును వృథా చేయకుండా రాజ్యాంగం కల్పించిన హక్కును చాటుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు నిర్భయంగా తరలిరావాలని ఆమె సూచించారు.

News February 11, 2026

సేవా రంగంలో గుంటూరు టాప్.. మిగతావాటిలో వెనుకబాటు

image

సేవా రంగంలో గుంటూరు జిల్లా 97 స్కోరుతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ‘A+’ గ్రేడ్ సాధించింది. కానీ, టీనేజ్ గర్భధారణల్లో (8-10%) జిల్లా ఆందోళనకర స్థాయిలో ఉండటం గమనార్హం. పదో తరగతి అసెస్‌మెంట్‌లోనూ విద్యార్థులు C, D గ్రేడ్లకే పరిమితమయ్యారు. మరోవైపు, రైల్వే బ్రిడ్జిల (ROB) పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణ సమస్యలతో జాప్యం జరుగుతోంది. వీటిపై దృష్టి సారించకపోతే ఇబ్బందులు తప్పవు.