News March 13, 2025
పార్వతీపురం జిల్లా ఎస్పీ హెచ్చరిక

సారా, మద్యం అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్ శిక్షణకు వచ్చిన ఎస్ఐలకు పోలీస్ స్టేషన్లకు కేటాయించామన్నారు. వారు ప్రస్తుత ఎస్ఐలతో కలిసి ఏజెన్సీ ప్రాంతాల్లో సారా, అక్రమమద్యం, గంజాయి, మాదకద్రవ్యాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అక్రమ రవాణా చేసి పట్టుబడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
Similar News
News February 13, 2026
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త కెప్టెన్

IPL: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త కెప్టెన్ నియమితులయ్యారు. రియాన్ పరాగ్ తమ సారథి అని ఆ జట్టు ట్వీట్ చేసింది. గతంలో ఈ జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించిన షేన్ వార్న్, రాహుల్ ద్రవిడ్, వాట్సన్, రహానే, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ పేర్లతో పోస్టర్ రిలీజ్ చేసింది. గతేడాది వరకు సారథిగా వ్యవహరించిన సంజూ ట్రేడ్‌లో CSKకు వెళ్లిన విషయం తెలిసిందే. 2025 సీజన్‌లో పలు మ్యాచులకు పరాగ్ కెప్టెన్‌గా చేశారు.
News February 13, 2026
BIG BREAKING: నిర్మల్‌లో కాంగ్రెస్ విజయం

నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ మొత్తం 42 వార్డులకు గాను 25 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 14 వార్డులు బీజేపీ, ఎంఐఎం 2, BRS 1 వార్డు గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక్కడ బీజేపీ MLA మహేశ్వర్ రెడ్డి ఎంత ప్రచారం చేసినా ఆ పార్టీని గెలిపించుకోలేకపోవడంతో స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది.
News February 13, 2026
BREAKING: నర్సంపేట పీఠం కాంగ్రెస్‌దే

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం 30 వార్డులకు గాను 20 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 7 స్థానాలు, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 16 కంటే అదనంగా మరో నాలుగు స్థానాలు దక్కాయి.


