News October 7, 2025
పార్వతీపురం నుంచి 30 ప్రత్యేక బస్సులు

విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర సందర్బంగా పార్వతీపురం జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు సేవలందిస్తున్నాయి. జిల్లా నుంచి 30 బస్సులు ఏర్పాటు చేసినట్లు RTC అధికారులు తెలిపారు. పార్వతీపురం డిపో నుంచి 10 బస్సులు, పాలకొండ నుంచి 12, సాలూరు డిపో నుంచి 8 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గతేడాది కంటే 6 బస్సులు అదనంగా ఏర్పాటు చేశామని మంగళవారం ఉదయం నుంచే సేవలందిస్తున్నాయన్నారు.
Similar News
News January 19, 2026
మున్సిపల్ ఎన్నికలకు నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్‌గా ఉత్తమ్ కుమార్

రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో రాష్ట్రంలో గడువు పూర్తైన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
News January 19, 2026
స్పెయిన్ రైలు ప్రమాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య

దక్షిణ స్పెయిన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 39కి చేరింది. మలగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న ఇరియో హైస్పీడ్ రైలు అడముజ్ సమీపంలో పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 రైళ్ల బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పదేళ్ల కాలంలో స్పెయిన్‌లో జరిగిన అత్యంత భయంకరమైన రైలు ప్రమాదం ఇదే.
News January 19, 2026
విశాఖ: ఫిర్యాదులు చేసేందుకు ఎవరూ రాలేదు!

ప్రతి సోమవారం జీవీఎంసీలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ 10 గంటలకు ప్రారంభమైనా ఫిర్యాదుదారులు కనిపించలేదు. మరోవైపు అధికారులు కూడా సగానికి పైగా లేకపోవడం విశేషం. అన్ని సీట్లు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో వచ్చిన వారు విస్తుపోతున్నారు. పండగ ఎఫెక్ట్ కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని పలువురు భావిస్తున్నారు.


