News August 21, 2025

పార్వతీపురం: ‘పశు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు’

image

పార్వతీపురం జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పశువుల అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పశుసంవర్థక అధికారి డా.ఎస్ మన్మథరావు హెచ్చరించారు. అటువంటి ఫిర్యాదులు వస్తే తక్షణమే రంగంలోకి దిగుతామని గురువారం తెలిపారు. పోలీస్, రెవెన్యూ, మార్కెటింగ్, రోడ్డు రవాణా శాఖ, జంతు సంరక్షణ కమిటీ సహకారంతో బాధ్యులపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మరి మీ పరిధిలో అక్రమ రవాణా జరుగుతోందా?

Similar News

News January 14, 2026

సిరిసిల్ల: ప్రమాదాల నివారణకు సహకరించాలి: ఎస్పీ

image

ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాలను నివారణకు సహకరించాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతె అన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంగళవారం రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా మీ ప్రాణాలే కాకుండా ఎదుటివారి ప్రాణాలు కూడా కాపాడిన వారు అవుతారని ఆయన పేర్కొన్నారు.

News January 14, 2026

గుట్టన్న స్మారకమే ఆదివాసీ అమరుల స్థూపం!

image

మేడారంలో గద్దెల పునరుద్ధరణతో ఆదివాసీల చరిత్ర సరికొత్తగా తలెత్తుకుంది. ఇదే క్రమంలో కొన్ని నిర్మాణాలు, మార్పులు అందర్నీ ఆలోచనలో పడేస్తున్నాయి. ఇందులో ఒక్కటే ఊరట్టం స్థూపం. మేడారం సమీపంలోని ఎలుబాకకు చెందిన జనశక్తి పార్టీ నేత గుట్టన్న స్మారకార్థం నిర్మించారు. మంత్రి సీతక్క సూచనతో దానికి ఆకుపచ్చ, ఎరుపు రంగులు అద్ది ‘ఆదివాసీ అమరుల స్థూపం’గా నామకరణం చేశారు. నక్సలైట్‌గా సీతక్క జనశక్తి పార్టీ సభ్యురాలే.

News January 14, 2026

జనవరి 14: చరిత్రలో ఈరోజు

image

1896: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్‌ముఖ్ జననం
1937: సినీ నటుడు రావు గోపాలరావు జననం
1937: సినీ నటుడు శోభన్ బాబు జననం(ఫొటో-R)
1951: సినీ దర్శకుడు జంధ్యాల జననం(ఫొటో-L)
1979: కవి కేసనపల్లి లక్ష్మణకవి మరణం