News March 16, 2025
పార్వతీపురం: ‘పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయం’

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయమని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేశారు.
Similar News
News February 15, 2026
హసీనా అప్పగింతపై BNP ఆశాభావం

షేక్ హసీనాను భారత్ అప్పగిస్తుందని ఇటీవల బంగ్లా ఎన్నికల్లో గెలిచిన BNP ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ అంశం ఇరుదేశాల మధ్య సంబంధాలకు అడ్డుగా మారకూడదని ఆ పార్టీ నేత మీర్జా ఫక్రుల్ చెప్పారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఆమెను అప్పగించాలని ఇప్పటికే INDను కోరినట్లు తెలిపారు. బంగ్లాలో అల్లర్ల కారణంగా 2024లో హసీనా పారిపోయి భారత్‌కు వచ్చారు. తర్వాత ఢాకా అల్లర్ల కేసులో అక్కడి కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.
News February 15, 2026
యనమలకుదురులో ఐజీపీ తనిఖీలు

మహాశివరాత్రి పురస్కరించుకొని యనమలకుదురులో భద్రతా ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజీపీ జీ.వీ.జీ. అశోక్ కుమార్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పండుగను భక్తులు ప్రశాంతంగా జరుపుకొనేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభల ఊరేగింపు, భక్తుల రద్దీని అంచనా వేసి తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.
News February 15, 2026
TODAY HEADLINES

* రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
* రూ.57,868 కోట్లతో అమరావతి పనులు: పయ్యావుల
* బిల్ గేట్స్‌ను 3సార్లు APకి తీసుకొచ్చింది నేనే: CBN
* బడ్జెట్ ప్రసంగంలో భజనే ఉంది: బొత్స
* దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోంది: మోదీ
* USతో డీల్.. ‘టెక్స్‌టైల్’కు ఉరితాడు: రాహుల్
* ‘మున్సిపల్’ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: రేవంత్
* TG: 17న ‘రైతు భరోసా’?
* TG: కొత్తగూడెం కార్పొరేషన్.. CPI, కాంగ్రెస్ పొత్తు


