News February 26, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు సెలవు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల సందర్భంగా గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 15 మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సెలవును ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని ఆయన చెప్పారు.
Similar News
News February 27, 2025
రేవేంద్రపాడులో భార్యాభర్తల అనుమానాస్పద మృతి

దుగ్గిరాల (M) రేవేంద్రపాడులో అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతిచెందారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురేశ్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య శ్రావణి మృతదేహం కూడా పక్కనే పడి ఉంది. కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవ జరుతున్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి వీరి మధ్య ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తోంది. బుధవారం ఇంట్లో విగత జీవులుగా ఉన్న ఇద్దరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
News February 27, 2025
HYD: 2030 నాటికి 1.27 కోట్ల జనాభా..!

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్‌పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.
News February 27, 2025
100 కోట్ల మంది సంపాదన అంతంతమాత్రమే!

దేశంలోని 140 కోట్లకు పైగా జనాభాలో 100 కోట్ల మంది సంపాదన అంతంతమాత్రమే అని వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్లూమ్ వెంచర్స్ అంచనా వేసింది. స్వేచ్ఛగా ఖర్చు చేయగలిగే వినియోగదారులు 13-14కోట్లే అని పేర్కొంది. మరో 30 కోట్ల మంది ఇప్పుడిప్పుడే పర్సుల్లోంచి డబ్బులు తీయడం స్టార్ట్ చేశారని తెలిపింది. మరోవైపు, దేశంలోని 57.7శాతం సంపద కేవలం 10శాతం మంది భారతీయుల వద్దే ఉందని బ్లూమ్ వెంచర్స్ స్పష్టం చేసింది.