News April 3, 2024
పార్వతీపురం మన్యం జిల్లాలో మొదలైన పెన్షన్ల పంపిణీ

పార్వతీపురం మన్యం జిల్లాలో పెన్షన్ల పంపిణీ మొదలైందని ఇంచార్జ్ పీడీ Y.సత్యంనాయుడు తెలిపారు. జిల్లాలో ఉన్న 15 మండలాలు 3 మున్సిపాలిటీల్లో మొత్తం 14,5409 మంది పెన్షన్ దారులకు ఇప్పటికే 621 మందికి వివిధ సచివాలయాల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. పాలకొండ మండలం లో అత్యధికంగా 270 మందికి అత్యల్పంగా సాలూరు మండలంలో ఒక్కరికీ అందివ్వడం జరిగింది. ఇంకా సాలూరు అర్బన్, సీతంపేట, కురుపాంలో ప్రారంభించాల్సి ఉంది.
Similar News
News April 16, 2026
విజయనగరంలో రేపు జాబ్ మేళా..

విజయనగరం MR కాలేజీలో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా గురువారం తెలిపారు. ఉ.10.30 గంటలకు ప్రారంభమయ్యే మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్‌ప్లస్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీ సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ టు డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై, 18-30 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.12,600-రూ.20,000 పైగా వేతనం లభిస్తుందని తెలిపారు.
News April 16, 2026
VZM: అవినీతి..రూ.20 లక్షల గోల్ మాల్

బాడంగిలోని పలు గ్రామాలలో ఉపాధి హామీ పనులలో అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీలలో గుర్తించారు. సామాజిక తనిఖీ ప్రజా వేదికను ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. మూడు క్లస్టర్లలో మస్టర్లు దిద్దుబాటు చేసి, పనికి రాకుండానే వచ్చినట్లు మస్టర్లు వేసి రూ. 20లక్షల వరకు స్వాహా చేసినట్లు డీఆర్పీలు వెల్లడించారు. అవినీతి సొమ్ము రికవరీ చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు.
News April 15, 2026
VZM: ‘ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేందుకు బంగ్లా నుంచే అంకురార్పణ’

ప్రజలకు సేవ చేయడం మానేసి ఫ్లెక్సీల రాజకీయాలు చేయడం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. బొత్సపై ఫ్లెక్సీలు వేయడంపై బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. అనాడు ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేయడానికి బంగ్లా కారణం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడంలో బంగ్లాలోనే అంకురార్పణ జరిగిందన్నారు. బొత్స దిగువ స్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలగా ఎదిగారన్నారు.


