News March 12, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ మండలాల వారు జాగ్రత్త

image

పార్వతీపురం మన్యంలో నేడు ఈ మండలాల్లో వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారిక X ఖాతా ద్వారా మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. వడగాలుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

Similar News

News January 19, 2026

అసలేంటీ ‘ట్రేడ్ బజూకా’!

image

తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు 2023లో ‘ట్రేడ్ బజూకా’(బెదిరింపుల వ్యతిరేక సాధనం-ACI)ను EU అమల్లోకి తెచ్చింది. ఇతర దేశాల ఆర్థిక బెదిరింపులు, బలవంతపు వాణిజ్య పద్ధతుల నుంచి తమ రక్షణ కోసం రూపొందించింది. కౌంటర్ టారిఫ్స్, దిగుమతులపై ఆంక్షలు, యూరోపియన్ మార్కెట్లలోకి ఆయా దేశాల యాక్సెస్‌ను, పెట్టుబడులను నియంత్రించడం, కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ చేయడం వంటి పవర్స్ దీనికి ఉంటాయి.

News January 19, 2026

JGTL: మున్సిపల్ పోరు.. జీవన్ వర్సెస్ సంజయ్!

image

JGTLలో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య వార్ పీక్ స్టేజికి చేరింది. దీంతో తమకు బీఫామ్ ఇచ్చే నేత ఎవరో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ 2 వర్గాలుగా విడిపోవడంతో ఏ డివిజన్ టికెట్ ఎవరు ఫైనల్ చేస్తారో తెలియక స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. JGTL మున్సిపల్‌లో 50 డివిజన్స్ ఉండగా.. 94,800 మంది ఓటర్లు ఉన్నారు.

News January 19, 2026

హైదరాబాద్‌లో 54 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

image

నగరంలో పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. మొత్తం 54 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుంచి పెద్ద సంఖ్యలో SHOలు ఇతర విభాగాలకు బదిలీ అయ్యారు. మరో 26 మంది బదిలీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వారందరూ సీపీ కార్యాలయంలో వెంటనే రిపోర్ట్ చేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.