News April 23, 2025
పార్వతీపురం మన్యం: నేడే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

నేడు ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 220 పాఠశాలల నుంచి 10,455 మంది పరీక్ష రాయగా వారిలో 5,055 మంది బాలురు, 5,312 బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 10,367 మంది కాగా ప్రైవేట్‌గా 88 మంది పరీక్ష రాశారు. జిల్లావ్యాప్తంగా 67 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it
Similar News
News March 16, 2026
కలెక్టర్‌కు ఉద్యోగ సంఘాల అభినందనలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సెంటర్ ఫర్ మైగ్రేషన్ స్థాపించి, విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పిస్తున్న కలెక్టర్ మహేష్ కుమార్‌ను ఉద్యోగ సంఘాలు సోమవారం ఘనంగా సన్మానించాయి. అమరావతి జేఏసీ ఛైర్మన్ వి.ఎస్ దివాకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఆయనకు బొకేలు అందజేశారు. కలెక్టర్ కృషికి రాష్ట్రస్థాయి గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సాయిబాబు, గణేశ్ పాల్గొన్నారు.
News March 16, 2026
మోనాలిసా మైనర్.. పెళ్లి చెల్లదు: అంకుల్ విజయ్

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా మైనర్ అని, 2009లో పుట్టారని ఆమె అంకుల్ విజయ్ భోస్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్‌పోర్టు పత్రాల్లో ఆమె వయసును ఎక్కువ చేసి చూపారని తెలిపారు. ఫర్మాన్ ఖాన్‌తో వివాహం చట్టబద్ధంగా చెల్లదని పేర్కొన్నారు. ఈ పెళ్లి లవ్ జిహాదేనని ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా <<19360382>>మరోసారి<<>> స్పష్టం చేశారు. ఈ విషయాన్ని త్వరలోనే మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
News March 16, 2026
పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిరి

కర్నూలు ఏ క్యాంప్‌లోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సోమవారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వసతులపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచామని ఏపీసీ లోకరాజు తెలిపారు. నిబంధనల ప్రకారం పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.


