News September 12, 2025

పార్వతీపురం: వంట నూనె అనుకొని గడ్డి మందుతో కూర

image

వంట నూనె అనుకొని గడ్డి మందుతో కూర వండిన ఘటన పార్వతీపురం మండలం పనసభద్రలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన ఓ మహిళ కూర వండుతూ నూనెకు బదులు గడ్డి మందును వేసింది. ఈ ఆహారం తిన్న ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సంతోషి తెలిపారు.

Similar News

News December 16, 2025

‘జూలూరుపాడు పంచాయతీకి ఎన్నికలు లేవు’

image

చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 156 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఒక్క జూలూరుపాడు గ్రామ పంచాయతీకి సంబంధించి కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఆ గ్రామానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మొత్తం స్థానాల్లో 10 ఏకగ్రీవంగా ఖరారయ్యాయని, మిగిలిన 145 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 17న ఎన్నికలు ఉంటాయని కలెక్టర్ చెప్పారు.

News December 16, 2025

ఈనెల 18 వరకు జిల్లాలో ఆంక్షలు అమలు: SP

image

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18 వరకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఆదేశాల ప్రకారం నలుగురు, అంతకంటే ఎక్కువ గుంపులుగా చేరడం, ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News December 16, 2025

AP-RCET ఫలితాలు విడుదల

image

పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే AP-RCET(రీసెర్చ్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో గత నెల నవంబరులో పరీక్షలు జరిగాయి. మొత్తం 65 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా, 5,164 మంది ఎగ్జామ్స్ రాశారు. వారిలో 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏపీ ఆర్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.ఉష తెలిపారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.