News February 9, 2025
పార్వతీపురం: ‘వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి’

జిల్లాలో ఎలాంటి తాగునీటి సమస్య తలెత్తకుండా పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. వేసవిలో తాగునీటి సమస్యలపై జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్‌ప్రసాద్ ఆదివారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 18, 2026
వేసవి కార్యాచరణ సిద్ధం చేయాలి: కామారెడ్డి కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.
News February 18, 2026
కండోమ్ వాడకంతో సంతానలేమి? ప్రచారంలో నిజమెంత?

కండోమ్‌లను ఎక్కువగా వాడటం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు వస్తాయనేది అపోహేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి కేవలం స్త్రీ గర్భాశయంలోకి స్పెర్మ్ వెళ్లకుండా అడ్డుకుంటాయే తప్ప పురుషుల హార్మోన్లపై లేదా స్పెర్మ్ క్వాలిటీపై ఎలాంటి ప్రభావం చూపవు. పైగా సుఖవ్యాధుల (STIs) నుంచి రక్షణ కల్పించడం ద్వారా ఇవి పరోక్షంగా ఫర్టిలిటీ హెల్త్‌ను కాపాడతాయి. సంతానోత్పత్తికి వీటివల్ల ముప్పు ఉండదని స్పష్టం చేశారు.
News February 18, 2026
సూర్యాపేట: నెల రోజుల్లో మాతా శిశు కేంద్రం సిద్ధం కావాలి: కలెక్టర్

సూర్యాపేట మాతా శిశు కేంద్రం భవన పనులను నెల రోజుల్లో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన, వైద్య పరికరాల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. కోదాడ ఘటనపై స్పందిస్తూ.. పిల్లలను వద్దనుకునే వారు వారిని రోడ్డుపై వదలకుండా ఆసుపత్రిలోని ‘ఉయ్యాల’లో ఉంచాలని తల్లులకు సూచించారు.


