News March 5, 2025

పార్వతీపురం: 394 మంది విద్యార్థులు గైర్హాజరు

image

జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ – 2 పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి డి. మంజుల వీణ పేర్కొన్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. మొత్తం 8,520 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా .. 8,126 మంది విద్యార్థులు రాగా.. 394 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.

Similar News

News December 15, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ ఇవాళ కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.1,34,730కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.750 ఎగబాకి రూ.1,23,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3,000 పెరిగి రూ.2,13,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 15, 2025

WGL: కాంగ్రెస్ 545, BRS 336, BJPకి 29 జీపీలు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయిగా ఉంది. మొదటి, రెండో దశలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 545 పంచాయతీలకు గెలువగా, బీఆర్ఎస్ 336, బీజేపీ 29, ఇతరులు 98 పంచాయతీలను గెలుచుకున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలిసారి బీజేపీ 29 జీపీలను గెలిచి తన ఖాతాను తెరవగా, మిగిలిన 3వ దశపై మూడు పార్టీలు గురి పెట్టాయి. బీఆర్ఎస్ రెండో విడతలో కాస్త మెరుగైన ఫలితాలనే సాధించింది.

News December 15, 2025

అంచనాలను అందుకోని రబీ సాగు

image

AP: గత కొన్ని నెలలుగా వర్షాభావం, అధిక వర్షాల ప్రభావం ప్రస్తుత రబీ సీజన్‌పై ప్రభావం చూపింది. 2 నెలలు గడుస్తున్నా రబీ సాగు అంచనాలను అందుకోలేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరుగుతోంది. వరి 1.33 లక్షలు, చిరుధాన్యాలు 1.21 లక్షలు, నూనెగింజలు 0.21 లక్షలు, అపరాలు 3.44 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి.