News April 18, 2024
పాలకుర్తి: ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వంశీ (21) గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Similar News
News September 9, 2024
నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని: ఏసీపీ
గణేష్ నవరాత్రులను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. నర్సంపేట పట్టణంలోని సిద్ధార్థ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఏసిపి కిరణ్ కుమార్ సోమవారం పూజలు నిర్వహించారు. డిప్యూటీ తహసిల్దార్ రవి, పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహ రాములు తదితరులు ఉన్నారు.
News September 9, 2024
సదస్సులో పాల్గొన్న మంత్రి సీతక్క
ఆగ్రాలో జరిగిన సామాజిక న్యాయం, సాధికారత సదస్సులో కేంద్ర మంత్రులు డాక్టర్ వీరేంద్ర కుమార్, రాందాస్ అథవాలేతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సీతక్క మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు.
News September 9, 2024
వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నకు రికార్డు ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న మరోసారి రికార్డు ధర పలికింది. గత వారం మార్కెట్లో క్వింటా మొక్కజొన్న ధర రూ.3,015 పలకగా.. నేడు అదే ధర పలికి రికార్డును కొనసాగించింది. మార్కెట్ చరిత్రలోనే ఇంత ధర రావడం ఇదే మొదటిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మొక్కజొన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.