News April 12, 2025
పాలకుర్తి: వినూత్న రీతిలో సీఎం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

పాలకుర్తి మండలం శాతపురం గ్రామానికి చెందిన రైతు గాదరి రామయ్య వినూత్న రీతిలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వారు పండించిన ధాన్యంపై త్రివర్ణ పతాక శైలిలో వారి పేర్లు రాసి తన అభిమానాన్ని చాటాడు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వేగవంతమైన చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన రామయ్య.. రైతులకు మద్దతుగా ఉన్న శాసన సభ్యురాలిని ప్రశంసించాడు.
Similar News
News January 22, 2026
అడిషనల్ కలెక్టర్ ఆస్తులు రూ.వందల కోట్లు

TG: గతనెలలో రూ.60వేల లంచం తీసుకుంటూ దొరికిన హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో ACB ఇవాళ రైడ్స్ చేసింది. సోదాల్లో రూ.4.65Cr విలువైన విల్లా, ఒక ఫ్లాట్, 8 ఓపెన్ ప్లాట్లు, 14.5 ఎకరాల వ్యవసాయ భూమి పేపర్లను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. రూ.30లక్షల నగదు, 297 గ్రా. బంగారం, రూ.44.04 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించింది. ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
News January 22, 2026
చక్రాయపాలెంలో ముగిసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు

అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో మొదటి బహుమతి అద్దంకి సాధించగా, రెండో బహుమతి చక్రాయపాలెం అందుకుంది. మూడో స్థానంలో కొమ్మినేని వారిపాలెం నిలవగా విజేతలకు సీఐ సుబ్బరాజు హాజరై బహుమతులు ప్రదానం చేశారు.
News January 22, 2026
మదనపల్లి బస్టాండులో పెద్దమండెం వ్యక్తి మృతి..!

మదనపల్లి ఆర్టీసీ బస్టాండులో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించింది. 2-టౌన్ SI రహీముల్లా, ఏఎస్ఐ రమణలు సీఐ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టారు. మృతుడు పెద్దమండెం మండలం వెలిగల్లు కాలానీకి చెందిన శంకరప్ప కొడుకు<<18916147>> మారుతీగా గుర్తించారు.<<>> మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని ఏఎస్ఐ రమణ తెలిపారు.


