News February 15, 2025

పాలకొండ: కుంభమేళాకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో మృతి

image

పాలకొండ మండలం ఎన్.కే రాజపురానికి చెందిన అర్తమూడి రాజేశ్వరి (58) తన భర్త భాగ్యరావుతో పాటు మరో 35 మందితో కలిసి వారం రోజుల కిందట ప్రత్యేక బస్సులో కుంభమేళాకు వెళ్లారు. ప్రయాగరాజ్‌లో పుణ్య స్నానమాచరించి వారణాసి వెళ్లారు. శుక్రవారం కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే ఆమె ఆయాసంతో తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే మరణించారు. ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Similar News

News April 10, 2026

రేపు నిజామాబాద్ జిల్లాకు RSS చీఫ్ మోహన్ భాగవత్

image

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ శనివారం NZB జిల్లాలో పర్యటించనున్నారు. RSS వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరాం పంత్ హెడ్గేవార్ పూర్వీకుల స్వగ్రామమైన జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తిలో నిర్మించిన కేశవ స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భాగవత్ ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు కంద కుర్తితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

News April 10, 2026

HDFC వినియోగదారులకు అలర్ట్!

image

సిస్టమ్ అప్‌గ్రేడ్ వల్ల రేపు 2.30AM నుంచి 6.30AMవరకు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు HDFC ప్రకటించింది. అయితే ఉదయం 5 తర్వాత UPI లావాదేవీలు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొంది. డెబిట్ కార్డుల ద్వారా రూ.5వేల వరకూ నగదు విత్‌డ్రాలు, ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. Zapp వాలెట్ సేవలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతాయని తెలియజేస్తూ వినియోగదారులను అలర్ట్ చేసింది.

News April 10, 2026

వరల్డ్ టాప్‌-2%లో నెల్లూరు శాస్త్రవేత్త

image

ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా ఐదోసారి నెల్లూరు శాస్త్రవేత్త డాక్టర్ అనుముకొండ వరదరాజులు చోటు సంపాదించారు. ఆయనను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సత్కరించారు. 75 ఏళ్ల వయసులో పసుపు, గోమూత్రం వంటి ప్రకృతి సిద్ధ పదార్థాలతో క్యాన్సర్ కణాలను నిరోధించే ‘నానో-మెడిసిన్’పై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఆయన సాధించిన అంతర్జాతీయ పేటెంట్లు జిల్లాకు గర్వకారణమని జేసీ కొనియాడారు.