News March 26, 2024

పాలకొల్లులో బీజేపీ నేత కారు ధ్వంసం

image

ఇంటి ఆవరణలో పార్కింగ్‌ చేసిన తన కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని పాలకొల్లుకు చెందిన బీజేపీ నాయకుడు రావూరి సుధ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 22న రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వద్ద కారు పార్కింగ్‌ చేశామన్నారు. మరుసటిరోజు ఉదయం చూసేసరికి వెనుక భాగంలో అద్దం పూర్తిగా ధ్వంసమై ఉందన్నారు. పార్కింగ్‌ స్థలంలో వరుసగా కార్లు ఉన్నా తన కారునే టార్గెట్‌ చేసి ధ్వంసం చేశారన్నారు.

Similar News

News February 13, 2026

ప.గో: దళారుల చేతిలో తీర ప్రాంత యువత విలవిల

image

మెరుగైన జీతం కోసం విదేశాలకు వెళ్లాలనే కోస్తా తీర నిరుద్యోగుల ఆశ దళారులకు వరంగా మారుతోంది. ఆయిల్ కంపెనీల్లో భారీ వేతనాలతో ఉద్యోగాలంటూ నమ్మించి నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ముంచుతున్నారు. ఈప్రాంతంలో ఆయిల్ రిగ్గులపై పనిచేసిన అనుభవం ఉన్నవారు ఎక్కువగా ఉండటంతో, దళారులు సులభంగా బుట్టలో వేసుకుంటున్నారు. అప్పులు చేసి డబ్బులు చెల్లించిన యువత, తీరా మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు.

News February 13, 2026

వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలి: కలెక్టర్

image

ప.గో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒకటి నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు.

News February 12, 2026

పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో పీఎం శ్రీ, మనబడి మన భవిష్యత్తు పథకాల పురోగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సమీక్షించారు. విద్యా, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మాట్లాడిన ఆమె.. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.