News April 10, 2025

పాలకొల్లు : లవ్ మ్యారేజ్ ..మూడు నెలలకే ఆత్మహత్య

image

ప్రేమ వివాహం చేసుకున్న మూడు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాలకొల్లులో జరిగింది. 28వ వార్డుకు చెందిన సతీశ్ మంగళవారం భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. కుటుంబీకులు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదుతో ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News April 16, 2026

టీడీపీ పదవుల్లో ‘పశ్చిమ’కు పెద్దపీట

image

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పోలిట్‌బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్‌లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్‌కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

News April 16, 2026

ప.గో: సహాయం చేయండి.. బహుమతి పొందండి

image

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే ‘పీఎం-రాహత్’ పథకంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గాయపడిన వారికి రూ. 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని బుధవారం తెలిపారు. బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చే వారికి రూ.25 వేల నగదు పురస్కారం అందజేస్తామన్నారు. విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు.

News April 15, 2026

ప.గో: నవవరుడిపై కత్తితో పీక కోసి హత్యాయత్నం

image

నవవరుడిపై కత్తితో పీక కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పాలకొల్లుకు చెందిన చందక సాయికుమార్, సాయి శ్రీదుర్గలు ప్రేమించుకున్నారు. మేజర్లు కావడంతో పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇచ్చి ఈనెల 12న నరసాపురంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పెద్దలు ఒప్పుకోవడంతో ఈనెల14న వధువు ఇంటికి దంపతులు వెళ్లారు. శ్రీను అనే వ్యక్తి వరుడిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.