News December 1, 2025

పాలమూరులో ప్రతీ నియోజకవర్గానికి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ :CM

image

అన్ని వర్గాల పిల్లలకు ఉన్నత విద్యను అందించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మక్తల్ సభలో మాట్లాడిన సీఎం, మక్తల్‌తో పాటు ఇతర నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోయినా 25 ఎకరాలను భూసేకరణ చేసి పరిహారం చెల్లిస్తూ రూ.200 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News February 18, 2026

పార్వతీపురం: జేఈఈ మెయిన్స్‌లో ఓకే పాఠశాల నుంచి 22 మందికి ర్యాంకులు

image

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జోగింపేటలో ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్సియల్ ‘స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. ఈ ఫలితాలు పట్ల జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను మంగళవారం ఆయన ఛాంబరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకే పాఠశాల నుంచి ఏకంగా 22 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు.

News February 18, 2026

ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: ప్రకాశం కలెక్టర్

image

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ప్రకాశం భవనం నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యం, స్వామిత్వ సర్వేపై సమీక్షించారు. APMAY 2.0 పథకంతో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.

News February 18, 2026

తూ.గో: ఆర్మీలో చేరాలనుకునే యువతకు సువర్ణావకాశం

image

అగ్నివీర్ నియామకం-2027కు సంబంధించి భారత సైన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ GD, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్ విభాగాలకు అర్హులైన వారు ఏప్రిల్‌ 1 లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, విశాఖపట్నం పరిధిలోని శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు 13 జిల్లాల అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు <>అధికారిక వెబ్‌సైట్<<>> ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.