News December 2, 2025
పాలమూరు: అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌కి నామినేషన్!

బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కమతం నందిని శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈమె ముగ్గురు పిల్లలు అమెరికాలో స్థిరపడగా, ఆరేళ్ల నుంచి వారి వద్దనే ఉంటున్నారు. అయితే, సర్పంచ్ స్థానాన్ని జనరల్‌కు కేటాయించడంతో ఆమె అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ పదవికి నామపత్రాలు సమర్పించారు.
Similar News
News February 10, 2026
జగన్‌కు జెడ్ ప్లస్ భద్రతను కల్పించాలి: వైసీపీ

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైసీపీ లేఖ రాసింది. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేసింది. జగన్ పర్యటనల్లో పోలీసులు ఇష్టమొచ్చినట్లుగా చివరి నిమిషంలో రూట్లు మారుస్తున్నారని ఆరోపించింది. ఇటీవల తలెత్తిన భద్రతా లోపాలను ప్రస్తావిస్తూ వాటిపై విచారణ చేపట్టాలని కోరింది.
News February 10, 2026
12న ఏనుమాముల మార్కెట్‌కు సెలవు

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో ఈ నెల 12న ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు. మార్కెట్‌లోని గుమస్తాలు, దాడువాయిలు సమ్మెకు మద్దతుగా విధులను బహిష్కరిస్తున్నట్లు తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్‌లో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని, కావున రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకువచ్చి ఇబ్బంది పడవద్దని ఆయన కోరారు.
News February 10, 2026
మా ఇంధనం ఇండియా కొనకుండా US అడ్డుకుంటోంది: రష్యా

ఇండియా, ఇతర భాగస్వాములు తమ చౌకైన ఇంధనం కొనకుండా నిషేధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపించింది. అధిక ధరలకు US LNGని కొనాలని బలవంతం చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ మండిపడ్డారు. ఉక్రెయిన్‌తో సమస్య పరిష్కారానికి అమెరికా ప్రతిపాదనను తాము అంగీకరించామని, కానీ కొత్త ఆంక్షలు విధించారని విమర్శించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లు, సరఫరా మార్గాలను నియంత్రించడమే ఆ దేశ లక్ష్యమని ఫైరయ్యారు.


