News January 13, 2026
పాలమూరు: ఎస్సీ, స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

MBNR జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్, బ్యాంకింగ్, ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన వారికి 5 నెలల పాటు ఉచిత వసతి, భోజనం, పుస్తకాలు మరియు స్టైఫండ్ అందజేస్తారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ డిగ్రీ అభ్యర్థులు tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 18, 2026
రామగుండం: వైద్య పరికరాల కొనుగోలు కోసం కొటేషన్లు ఆహ్వానం

రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వివిధ పరికరాల రిపేర్, కొత్త పరికరాల కొనుగోలు కోసం ఆసక్తిగల వెండర్ల నుంచి కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.5,000, దరఖాస్తు రుసుము, రూ.20,000 ఈ ఎండీ ఫీజు చెల్లించి ఈనెల 19 నుంచి 21 వరకు ఆసుపత్రిలో నేరుగా అందజేయాలని సూచించారు. అదే రోజు సాయంత్రం మెడికల్ సూపరింటెండెంట్ ఆలయంలో కొటేషన్లు తెరవబడతాయని తెలిపారు.
News February 18, 2026
ADB: నిరుద్యోగులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నట్లు జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రమేష్ తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాల కోసం హాస్టల్ వసతి, శిక్షణ, రూ.3,000 పుస్తకాలు, 12 నోట్‌బుక్స్, కాస్మోటిక్స్ చార్జీలు ఇస్తామన్నారు. ఈ నెల 22లోపు tsstudycircle.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 18, 2026
ఆసిఫాబాద్ జిల్లాలో కోడ్ ఎత్తివేత: కలెక్టర్

జిల్లాలో అమలులో ఉన్న మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎత్తివేసినట్లు ASF కలెక్టర్ హరిత తెలిపారు. 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల భాగంగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలలో కౌన్సిలర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 17తో పూర్తయిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియమావళి ఎత్తివేసినట్లు వెల్లడించారు.


